- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan: ‘RC16’ లో స్టార్ నటుడు.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్ (ట్వీట్)
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘RC16’. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలో బుచ్చిబాబు మైసూరులోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలు పెట్టాలని వెళ్లారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రాబోతుంది. తాజాగా, మేకర్స్ ‘RC16’ అప్డేట్ ఇచ్చారు.
ఇందులో స్టార్ నటుడు జగపతి బాబు(Jagapathi Babu) నటించబోతున్నట్లు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. దీంతో జగ్గూభాయ్ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. ప్రజెంట్ మేకర్స్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు విలన్ పాత్రలోనే నటించడం ఖాయమని చర్చించుకుంటున్నారు. కాగా, రామ్ చరణ్, సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన చిత్రం రంగస్థలం. అయితే ఇందులో జగపతి బాబు విలన్ నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో అందరి దృష్టి ‘RC 16’ పై పడింది.