జీవితంలో మీరు సంతోషంగా ఉండాలా..? ఈ రెండు విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-22 08:23:57.0  )
జీవితంలో మీరు సంతోషంగా ఉండాలా..? ఈ రెండు విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
X

దిశ, ఫీచర్స్: నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో, చాలామంది భవిష్యత్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ..ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతుంటారు. గతాన్ని ఆలోచిస్తూ, భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. దీని వల్ల మనస్సు, శరీరం రెండూ అనారోగ్యం పాలవుతాయి. గతంలో జరిగిపోయిన విషయాలకు బాధపడుతూ, భవిష్యత్‌ ఎలా ఉంటుందో అని భయపడడం మానేసి, ఈ క్షణంలో ఆనందంగా ఉంటే ఎటువంటి సమస్యలు దరిచేరవు. కాస్త తెలివిగా ఆలోచిస్తూ, జీవితంపై శ్రద్ధ పెడితే ప్రతీ క్షణం మీరు ఆనందంగా జీవించవచ్చు. గతం, భవిష్యత్ గురించి వచ్చే ఆలోచన శారీరకంగా, మానసికంగా మనిషిని కుంగదీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేస్తే చాలు:

గతంలో మిమ్మల్ని బాధించిన వస్తువులు, గుర్తులను చెరిపేయడానికి ట్రైయ్ చేయండి. ఏదైనా కష్టమైన పరిస్థితి నుండి బయటపడిన వారైతే వాటి గురించి ఆలోచించడం మానేయండి. ఇంట్లో గతానికి సంబంధించిన వస్తువులను తీసేయండి. ప్రస్తుత క్షణంలో ఆనందంగా ఉండాలంటే గతాన్ని విడిపెట్టాలి. అలాగే, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ భయపడకండి. ప్రస్తుతం ఉన్న ప్రతీ క్షణంలో ఆనందంగా ఉండండి. ప్రతి రోజూ చిరునవ్వుతో మీ జీవితాన్ని ప్రారంభించండి. ఇలా చేస్తే, ఆ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.

చుట్టూ ఉండే మనుషుల భావోద్వేగాలు, వారు సాధించిన విజయాలు, కనిపించే దృశ్యాలు అన్నింటిలో ఆనందాన్ని వెతుక్కోండి. జీవితంలో ప్రతీ చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటే, గతం, భవిష్యత్ గురించి ఆలోచనలు దరిచేరవు. ప్రతీ ఒక్కరికి గతం ఉంటుంది. ఆ గతంలో చేదు అనుభవాలు, ఆనందాన్ని కలిగించే విషయాలు కొన్ని ఉంటాయి. అందులో ఉండే సంతోషకరమైన విషయాలను గుర్తు చేసుకోండి. గతంలోని బాధలు, కోపాలను మనసులో ఉంచుకుంటే, జీవితం నాశనం అవుతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి, ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఎవరో మీకు హాని చేశారని వారి పట్ల మనసులో పగ పెంచుకుంటే అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గతంలో కలిగిన బాధలు, కష్టాల గురించి ఆలోచించడం మాసేసి, ముందుకు సాగండి.

ప్రస్తుతం మీరు ఎలాంటి పని చేస్తున్నా అందులో ఆనందాన్ని వెతుక్కోండి. ఆ పనిని ప్రేమించడం మొదలు పెట్టండి. దానిపై విజయం సాధించేందుకు ప్రతీక్షణం కష్టపడండి. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. చేస్తున్న పనిపై శ్రద్ధ చూపకపోతే అది మానసిక సమస్యలకు కారణం అవుతుంది. చాలామంది భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. గతం గురించి బాధపడుతూ 70 శాతం జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి గతం, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయండి. ప్రతీ రోజూ సంతోషంగా ఉంటూ మీ లక్ష్యంమైపు అడుగులు వేయండి.

ఎవ్వరికైనా సరే మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీ జీవితం సంతోషంగా ఉండాలంటే గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించడం మానేయండి. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే ప్రతీ క్షణం మీరు సంతోషంగా ఉండవచ్చు. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రోజూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి.

Read More : కొత్తగా పెళ్లైందా..? మన దేశంలోని బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ ఇవిగో!

Advertisement

Next Story

Most Viewed