AP News:కారంపూడి పట్టణంలో రీ సర్వే ప్రక్రియ ప్రారంభం

by Jakkula Mamatha |
AP News:కారంపూడి పట్టణంలో రీ సర్వే ప్రక్రియ  ప్రారంభం
X

దిశ, కారంపూడి: కారంపూడి మండల పట్టణ పరిధిలో శుక్రవారం రీ సర్వేను నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి కుషిణ్యా నాయక్. గ్రామాలన్నీ ఇకపై పూర్తిగా డిజిటలైజ్ కానున్నాయి. ఇప్పటి వరకు ఫైళ్లు, పరిపాలన పరమైన అంశాలను మాత్రమే ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయగా, కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పంచాయతీ పాలనను గాడిలో పెట్టడానికి డిజిటలైజేషన్ ద్వారా పూర్తి సమాచారం ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకునేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు ప్రతి గ్రామాన్ని డిజిటలైజేషన్ పరిధిలోకి తెచ్చే కసరత్తును ప్రారంభించారు. స్వర్ణ గ్రామ పంచాయతీ యాప్ ద్వారా డిజిటలైజేషణులు చేస్తున్న పంచాయతీ ఉద్యోగులు గ్రామాల్లో పాలనాపరమైన అంశాలే కాకుండా, ఆ గ్రామానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్లైన్‌లో పొందుపరుస్తున్నారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్వర్ణ గ్రామ పంచాయతీ యాప్ ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి గ్రామ వివరాలను అందులో పొందుపరిచే విధంగా ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మండల పరిధిలో 15 పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఆ పంచాయతీలో ఉన్న గ్రామాలు, ఆ గ్రామాల విస్తీర్ణం, గృహాలు, జనాభా, మౌలిక సదుపాయాలు, కొళాయిలు, ఇంటి పన్నులు ఇలా గ్రామానికి సంబంధించిన అన్ని అంశాలను ఆన్లైన్‌లో పొందుపరుస్తున్నారు. గ్రామాలకు వచ్చే నిధులు, చేపడుతున్న పనుల వివరాలను సైతం ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్ లో ఉండనున్నాయని తెలిపారు. ఆ పనులను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయం సిబ్బంది ఈ పనులను వేగంగా చేస్తున్నారు.

Advertisement

Next Story