- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Up grade : హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ
దిశ, హుస్నాబాద్ : దీపావళి కానుకగా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి (to Government Hospital in Husnabad town)మహర్దశ రానుంది. హుస్నాబాద్ శాసనసభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ లోని వందపడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మారుస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు రూ. 82 కోట్లు విడుదల (Rs.82 crores released)చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.
నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నుంచి రోజుకు వైద్య పరీక్షల నిమిత్తం 400 నుంచి 600 మంది పేషంట్స్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. కాగా 2015 లో 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రికి పేషెంట్స్ తాకిడి ఎక్కువ అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఆలోచించి 9 సంవత్సరాల తర్వాత 250 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ఉత్తర్వులు వెలవడడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ శాసన సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి పది నెలల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అయితే ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.