5 killed: ఐదుగురి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ఒడిశాలో దారుణం !

by vinod kumar |
5 killed: ఐదుగురి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ఒడిశాలో దారుణం !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా (Odisha)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగగా ముగ్గురు మహిళలు సహా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుంధర్ ఘర్ జిల్లా (Sunder ghar distric)లోని కరామ్ డిహి (karamdihi) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరామ్ డిహి ప్రాంతంలో అనుమానాస్పద వివాహేతర సంబంధంపై రెండు సంచార జాతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో గ్రామంలోకి ప్రవేశించి ఇతర వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సుందర్‌గఢ్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్ లను ఆ ప్రాంతంలో మోహరించారు. ఐదుగురినీ ప్రత్యర్థి బృందం నరికి చంపిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరణించిన వారిని ఛమా భోలా (25), పుండి పవార్ (65), సుభాష్ పవార్, చనమ్ కుమార్ భోంస్లే (40), భూక్య కైలా (56)గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన రెండు సంచార తెగలకు చెందిన వ్యక్తులు వివాహేతర సంబంధంపై ఘర్షణ పడినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed