- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kukatpally : వాస్తవాలను కప్పేసిన వాసవి నిర్మాణ సంస్థ...
దిశ, కూకట్పల్లి: ఎవరు ఏమనుకున్నా మాకేం సిగ్గు అన్న చందంగా తయారైంది బడా నిర్మాణ సంస్థల తీరు. జల కలతో కళకళలాడిన జలాశయాలు, తాగు, సాగు నీరును అందించిన వందల ఎకరాల చెరువులు రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో చిక్కుకుని కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధికి చెందిన గొలుసు కట్టు చెరువులలోని రెండు చెరువు బంధాన్ని తెంపి యధేచ్చగా రియల్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది బడా నిర్మాణ సంస్థ అయిన వాసవి. కూకట్పల్లి మండల పరిధిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ ఉన్న నాలాను మాయం చేశారు. మైసమ్మ చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో యధేచ్చగా నిర్మాణాలను చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా వాసవి గ్రూప్స్‌కు జీహెచ్ఎంసీ నుంచి పొందిన అనుమతి పత్రంలో ఉన్న సర్వే నంబర్లు ఇప్పటికి వ్యవసాయ భూమిగానే ధరణి పోర్టల్‌లో దర్శనమిస్తున్నాయి. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూమిగా బదిలి చేసుకోకుండానే గత పాలకులు 3 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్, 29 అంతస్థుల 9 బ్లాక్‌లతో భారి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. పూర్తిగా వాటర్ బాడీలో వాసవి నిర్మాణ సంస్థ తమ టవర్లను నిర్మాణం చేపడుతుందని ఇప్పటికే పలువురు జీహెచ్ఎంసీ తో పాటు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. చెరువును మింగేస్తున్న వాసవి నిర్మాణ సంస్థకే చెరువు సుందరీకరణ పనులను గత పాలకులు అప్పగించడం గమనార్హం.
దొంగకు తాళం చెవి..
మైసమ్మ చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్న బడా నిర్మాణ సంస్థ అయిన వాసవి గ్రూప్ నిర్మాణ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు మైసమ్మ చెరువు సుందరీకరణ పనులను కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సిఎస్ఆర్) కింద అప్పగించారు. రెండు ఏండ్ల పాటు చెరువు సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టే విధంగా జీహెచ్ఎంసీ, వాసవి గ్రూప్ సంస్థల మధ్య 2024, జులై 11వ తేదిన ఎంవోయూ జరిగింది. చెరువు సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే గడువు పొడగించబడుతుందన్న షరతులతో కూడిన ఒప్పందం కుదిరింది.
లేక్ వీవ్ పేరుతో విక్రయాలు..
చెరువు సుందరీకరణ పేరుతో కొంత మొత్తం ఖర్చు చేసి చెరువును సుందరీకరించేందుకు ముందుకు వచ్చిన వాసవి నిర్మాణ సంస్థ తమ ఫ్లాట్లను లేక్ వీవ్ పేరుతో విక్రయాలు చేపడుతుంది. చెరువులను చెరబడుతున్న బడా నిర్మాణ సంస్థలే మిగిలి ఉన్న చెరువును సీఎస్ఆర్ కింద సుందరీకరంచి పక్కనే చెరువు ఉంది అంటు బ్రోచర్లను ప్రింట్ చేసుకుని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా నిర్వహించుకునేందుకు జీహెచ్ఎంసీ అండగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని వేలం వేసిన గత పాలకులు..
మూసాపేట్ గ్రామం పరిధిలోని మైసమ్మ చెరువు, కాముని చెరువు మధ్యలో కాముని చెరువు అలుగుకు ఆనుకుని సర్వేనెంబర్ 75 లో ఉన్న 1.27 ఎకరాల ప్రభుత్వ భూమి గత బీఆర్ఎస్ హయాంలో వేలం వేశారు. సదరు భూమినిరూ. 75 వేలకు గజం లెక్కన వాసవి నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. పక్కనే ఉన్న ప్రైవేటు సర్వే నంబర్లలో వాసవి నిర్మాణ సంస్థ తమ వెంచర్‌ను నిర్మాణ పనులను చేపడుతుంది. ఇదిలా ఉండగా వాసవి నిర్మాణ సంస్థ చేపడుతున్న ప్రైవేటు సర్వే నెంబర్లో ఇప్పటికి ధరణిలో వ్యవసాయ భూమిగానే దర్శనమిస్తుంది. భూమి బదిలి కాకముందే నిర్మాణ పనులు చక చక కొనసాగుతున్నాయంటే అధికారులు ఏ రేంజిలో వారికి వంత పాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది.