Meenakshi Chaudhary: ‘విశ్వంభర’ సినిమాలో మీనాక్షి చౌదరి.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ

by Hamsa |
Meenakshi Chaudhary: ‘విశ్వంభర’ సినిమాలో మీనాక్షి చౌదరి.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), వశిష్ట కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’(Viswambhara). సోషియే ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశ్వంభర(Viswambhara) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. తాజాగా, ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో.. ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను ‘విశ్వంభర’లో భాగం కాదు. ఆ చిత్రంలో నటిస్తున్నట్లు నేనెప్పుడూ చెప్పలేదు. కానీ, అందులో నటిస్తున్నట్లు అందరూ రాసేస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’(Viswambhara)పై ప్రశ్నలు అడుగుతున్నారు. నటించే సినిమాల గురించి స్వయంగా నేనే వెల్లడిస్తాను. నేను చెప్పలేదు అంటే ఆ చిత్రంలో నటించడం లేదని అర్థం’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Advertisement

Next Story