మరికొన్ని గంటల్లో పోలింగ్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన CM రేవంత్ (వీడియో)

by Satheesh |   ( Updated:2024-05-11 09:19:59.0  )
మరికొన్ని గంటల్లో పోలింగ్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన CM రేవంత్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల పోలింగ్‌కు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక సందేశమిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని, అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొప్ప స్థాయికి ఎదిగారని, అలాంటి రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని, ఇవి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story