- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం మోడీ అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే నిర్మించారు. ఆ ప్రాజెక్టుతో పని లేకుండానే ఈ ఏడాది 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడు కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిందన్నారు. అలాంటపుడు లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు నిర్మించారని బీఆర్ఎస్(BRS) ను ప్రశ్నించారు. కులగణన(Cast Census)పై ప్రధానితో చర్చ జరగలేదని, కుల గణనపై పూర్తి గణంకాలు వచ్చాక తీర్మానం చేసి అప్పుడు కేంద్రం దగ్గరకు వెళ్తామన్నారు. పదేళ్లుగా మెట్రో విస్తరణను కేసీఆర్(KCR), కిషన్ రెడ్డి(Kishan Reddy) అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
మెట్రోరైల్ వ్యవస్థలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్(Hyderabad Metro) ఉంది.. ఇప్పుడు 9వ స్థానానికి పడిపోవడానికి కారణం బీఆర్ఎస్ నేతలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది(Musi River)పై రాజకీయాలు మానుకొని ఎలాంటి పరిహారం పునరావాసం కల్పించాలో విపక్షాలు సూచించాలన్నారు. ఔటర్ లోపల ఉన్న చెరువులను నోటిఫై చేస్తున్నామని, కొన్నిసార్లు నోటిఫై చేయకుండా ఆక్రమణలు కూల్చివేస్తే కోర్టుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయన్నారు. దీనికి కారణం హైడ్రా(HYDRA) అనేక విభాగాలలో సమన్వయం చేసుకోవాల్సి రావడమేనని, ఒక్కోసారి అది మిస్ అవడం వలన ఇలాంటివి జరుగుతున్నాయని వెల్లడించారు. నోటిఫికేషన్ చేసి నగరంలోని చెరువులను పునరుద్ధరిస్తామని సీఎం పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాపార భాగస్వామి, నిర్మాత కేదార్ దుబాయ్ లో అనుమానస్పదంగా చనిపోయాడని, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న న్యాయవాది సంజీవరెడ్డి కూడా అనుమానస్పదంగా మృతి చెందాడని, మేడిగడ్డ బ్యారేజీపై కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి హత్య(Rajalingamurthy Murder)కు గురయ్యాడని... ఈ మరణాల వెనక మిస్టరీ ఏమిటో కేసీఆర్, కేటీఆర్ లకే తెలియాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి ఇబ్బందులు లేవని, ప్రజల్లో అయోమయం సృష్టించడానికే విపక్షాలు ఇలాంటివి కల్పిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.