- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: ఫాక్స్‌కాన్(Foxconn) సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో కలిసి సీఎం రేవంత్ వెళ్లారు. ఈ సందర్భంగా పాక్స్ కాన్ పురోగతిపై ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, 2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది.. కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్ లియు వెల్లడించారు.