- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టు రాహుల్ పేరు ప్రస్తావించిన సీఎం రేవంత్.. ప్రెస్‌మీట్‌లో ఇదే హైలైట్!
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి స్వీకరించబోయే దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి లోగో రివీల్ చేశారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుసగా జర్నలిస్టులు ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాహుల్ కూడా ఓ ప్రశ్న అడగటానికి ప్రయత్నించారు.
దీనిని గమనించిన సీఎం ‘రాహుల్ చెప్పండి’ అంటూ ముందే సరదాగా అడగటంతో అందరూ ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు ‘ఈ వార్త మా రాహుల్ రాయాలి’ అంటూ ప్రెస్‌మీట్లలో సరదాగా ప్రస్తావించడంతో జర్నలిస్ట్ రాహుల్ ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశాడని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్లి ప్రధానిని నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.