CM Revanth Reddy : ఆరోగ్యశ్రీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : ఆరోగ్యశ్రీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ(ArogyaSri) ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 136 అంబులెన్స్ లను 108 సర్వీసుల కోసం, 77 అంబులెన్సులను 102 సర్వీసుల కోసం ఉపయోగించనున్నారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే 33 మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ లను ప్రారంభించారు. దీనితోపాటు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సహ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed