అలా చేయకపోతే నా జీవితానికి అర్థమే లేదు.. CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్

by Rajesh |
అలా చేయకపోతే నా జీవితానికి అర్థమే లేదు.. CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరు జనజాతర సభలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తాండూరుకు సాగునీరు ఇచ్చేందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. తాండూరుకు నీరు ఇచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేశారని.. తద్వార ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలన్నారు. మే 9 నాటికి రైతుభరోసా కింద రూ.7500 కోట్లు నిధులు వేస్తామని చెప్పాం.. చెప్పిన మాట ప్రకారం రెండు రోజుల ముందే మే 6 నాటికి రైతు భరోసా నిధులు వేశామన్నారు. పద్మనాభస్వామి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే నా జీవితానికి అర్థం ఉండదు అని తెలిపారు. విభజన చట్టం ప్రకారం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పరిశ్రమలు బీజేపీ రద్దు చేసిందని పేర్కొన్నారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ సోనియాగాంధీ కేటాయించారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సోనియా గాంధీ మంజూరు చేశారన్నారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ప్రాజెక్టులు మోడీ రద్దు చేశారని ఫైర్ అయ్యారు. ఈ పదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోడీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారని సెటైర్లు వేశారు. తెలంగాణకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story