చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రుణాల మాఫీకి సీఎం రేవంత్ హామీ

by Mahesh |
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రుణాల మాఫీకి సీఎం రేవంత్ హామీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇనిస్టిట్యూట్ అవసరం ఉన్నప్పటికి పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో రూ.30 కోట్లున్న చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికుల రుణ విముక్తులను చేస్తామని.. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటానన్నారు. అలాగే తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం అని.. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించామని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed