తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. పెళ్లి కానుకగా తులం బంగారం

by GSrikanth |
తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. పెళ్లి కానుకగా తులం బంగారం
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్‌ అధికారులతో సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్‌ను అంచనా వేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కోరారు.

అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమినీ గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు బడ్జెట్‌ను అంచనా వేయాలని తెలిపారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై పూర్తి అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story