CM Revanth Reddy:హరే రామ, హరే కృష్ణ ట్రస్ట్ సభ్యులతో సీఎం భేటీ!

by Ramesh Goud |
CM Revanth Reddy:హరే రామ, హరే కృష్ణ ట్రస్ట్ సభ్యులతో సీఎం భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలో సెమి రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా సీఎం సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిని హరే రామ, హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహించనున్నారు. దీని కోసమే ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ జరిపారు. ఈ ప్రాజెక్టు కింద సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతీరోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు సాధ్యసాద్యాలపై వారితో చర్చించారు. ఇందు కోసం కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిసింది. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని సీఎం ట్రస్ట్ సభ్యులకు సూచించినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed