- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం 11:30 గంటలకు ఏర్పాటు చేసినప్పటికీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం 12 గంటలకు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. సీఎం కేసీఆర్ 12 గంటల 7 నిమిషాలకు వచ్చారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశమే అజెండాగా కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ధాన్యం కొనుగోలు సీజన్ ముగిసేవరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో ఆ అంశం ఏమైనా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశం అనంతరం మధ్యాహ్నం మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే కేంద్ర మంత్రులతో పాటు మోడీని కలుస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంతకు అపాయింట్ మెంట్ తీసుకున్నారా? తీసుకోలేదా? అనేది ఇప్పటికే అధికారికంగా వెలువడలేదు. అయితే ఈ సమావేశంలో ఏం మాట్లాడుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది.