రేపు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్.. సెంటిమెంట్ ఆలయంలో పూజలు

by Javid Pasha |   ( Updated:2023-11-03 06:53:38.0  )
రేపు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్.. సెంటిమెంట్ ఆలయంలో పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సిద్దపేట పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేసీఆర్‌కు ఈ ఆలయమంటే సెంటిమెంట్‌గా చెబుతారు. ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడం, ఈ నెల 9న నామినేషన్ దాఖలు చేయనుండటంతో సెంటిమెంట్ ఆలయానికి కేసీఆర్ వస్తున్నారు.

ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవాలని తొలుత భావించారు. కానీ వరుస బహిరంగ సభలు ఉండటంతో పాటు రేపు శనివారం కావడంతో ముందుగానే కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి వారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాతనే కేసీఆర్ నామినేషన్ వేస్తారు. ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story