మహబూబాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

by GSrikanth |
మహబూబాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా గిరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రకటించారు. అంతేగాక, జిల్లాలోని మున్సిపాటీలకు రూ. 25 కోట్లు, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడింది కాబట్టే రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్ ప్రాంతం వెనుకబాటుకు గురైందని అన్నారు. మనం చేసుకుంటున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సగం చేసినా దేశం ఇప్పటికే బాగుపడేదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించకపోగా.. కాలు అడ్డం పెడుతోందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దేశం ఇలాగే ఉంటుందని ఆవేదన చెందారు.

Advertisement

Next Story

Most Viewed