- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుడిలా దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..!
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇటీవల అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజులు రెస్ట్ తీసుకున్నా కేసీఆర్.. కోలుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ప్రచారంలోనూ అదే దూకుడు కనబరుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగానే.. కేసీఆర్ మాత్రం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు రెండు మూడు చోట్ల బహిరంగా సభల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇవాళ మొదటగా సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సభ అనంతరం సిద్దిపేటలో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. సిద్దిపేట నుండి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా'లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాగా, దాబాలో సీఎం కేసీఆర్ చాయ్ తాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.