- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌తో క్లారిటీ.. వామపక్షాలకు ఇచ్చే సీట్లు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: టీ కాంగ్రెస్ 45 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ విడుదల చేయగా.. ఇందులో కీలక నేతలతో పాటు కొత్త ముఖాలకు కూడా అవకాశం దక్కింది. అయితే ఈ జాబితాతో పొత్తులో భాగంగా వామపక్షాలకు కాంగ్రెస్ కేటాయించే సీట్లపై కూడా కాస్త క్లారిటీ వచ్చింది. మిర్యాలగూడ, కొత్తగూడెం, చెన్నూరు, వైరా నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఈ సీట్లను సీపీఎం, సీపీఐకు కాంగ్రెస్ కేటాయించనుందని చెబుతున్నారు. పాలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో లెఫ్ట్ పార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాలను కూడా వామపక్షాలు ఆశించాయి.
కానీ మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ప్రకటించింది. దీంతో వామపక్షాలు పోటీ చేసే సీట్లపై ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే లెఫ్ట్ పార్టీలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. దీంతో మూడో జాబితాలో వామపక్షాలకు కేటాయించే సీట్లపై మరింత క్లారిటీ రానుంది.