TS: కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ ఫలితాలు, ఫిజికల్‌ టెస్టులపై క్లారిటీ!

by GSrikanth |
TS: కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ ఫలితాలు, ఫిజికల్‌ టెస్టులపై క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. ఈ వారం చివర్లో ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నవంబర్ నెలాఖరులో ఫిజికల్‌ టెస్టునూ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్టుల్లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులుగా భావిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 6,03,955 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

Advertisement

Next Story