ఎన్నికల వేళ టీ-కాంగ్రెస్ కీలక నేత మధు యాష్కీ గౌడ్ ఇంట్లో తనిఖీలు

by Satheesh |
ఎన్నికల వేళ టీ-కాంగ్రెస్ కీలక నేత మధు యాష్కీ గౌడ్ ఇంట్లో తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇంట్లో ఎలక్షన్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆఫీసర్స్ ఆదివారం హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. మధుయాష్కీ గౌడ్ ఇంటి పరిసర ప్రాంతాల వాసులను కూడా అధికారులు ఆరా తీశారు. డబ్బులు పంచుతున్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అధికారులు ఆయన ఇంటి నుండి వెనుదిరిగారు. కాగా, అధికార పార్టీ నేత ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మధు యాష్కీ గౌడ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story