ఉద్యోగాల పేరిట మోసం.. యువతకు తెలంగాణ పోలీస్ కీలక సూచన

by Rajesh |
ఉద్యోగాల పేరిట మోసం.. యువతకు తెలంగాణ పోలీస్ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాలు అనగానే యువత తొందరగా ట్రాప్‌లో పడతారని, ఈజీగా మోసం చేయొచ్చని కేటుగాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరిట తరచూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మోసాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. అయితే తాజాగా సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్‌కు చెందిన జోరవంతుల సత్యానారాయణ అనే వ్యక్తి తెలంగాణ యాంటీ కరప్షన్ ఇంటలిజెన్స్ కమిటీ జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా చలామణీ అవుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆఫీస్ తెరిచాడు.

దీంతో ఓ యువకుడు నమ్మి రూ.4లక్షల 15వేలు, మరో వ్యక్తి రూ.లక్షా50 వేలు సదరు వ్యక్తికి చెల్లించారు. ఎంతకు ఉద్యోగం రాకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఈ ఘటనకు ప్రస్తావిస్తూ ఉద్యోగమనేది మన నైపుణ్యత, అంకితభావం ఆధారంగా, మన కష్టపడే తత్వం ద్వారా అందే ప్రతిఫలమని గుర్తించండి అని సూచించింది. అంతేకాని కొనుక్కుంటే వచ్చే వస్తువు కాదు. నీ చుట్టూ నీ బలహీనతను ఆసరాగా చేసుకుని వల పన్నే మోసకారులుంటారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించింది. మీ అప్రమత్తతే మీ బలమని పేర్కొంది.

Next Story