నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై CM రేవంత్ కీలక ప్రకటన

by Satheesh |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగ జేఏసీ, పలు విద్యార్థి సంఘాలు ఇవాళ టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా.. పలువురు నిరుద్యోగులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ మేరకు పార్టీ విద్యార్థి, యువజన నేతలు, సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. కొన్ని పార్టీల స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులకు బలికావొద్దని ఈ సందర్భంగా నిరుద్యోగులకు రేవంత్ సూచించారు. పరీక్షలు జరిగేటప్పుడు ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మారిస్తే వచ్చే చట్టపరమైన సమస్యల గురించి పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రూప్- 2, డీఎస్సీ పరీక్షల తేదీ మార్పుపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మరోసారి నొక్కి చెప్పారు.

Advertisement

Next Story