- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం..310 పందులకు నిర్ధారణ
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని త్రిసూర్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేపింది. 310 పందులకు ఈ వ్యాధి సోకినట్టు అధికారులు గుర్తించారు. త్రిసూర్ జిల్లా మడక్కత్తర గ్రామంలో కేసులు నమోదయ్యాయి. అయితే మిగతా పందులకు ఈ వ్యాధి వ్యాపించకుండా 310 పందులను చంపాలని జిల్లా కలెక్టర్ పశుసంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పంది మాంసం పంపిణీని కూడా నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు వాటన్నింటినీ చంపే ప్రక్రియను ప్రారంభించారు. నష్టపోయిన పొలాలకు కిలోమీటరు పరిధిలోని ప్రాంతాన్ని ఇన్‌ఫెక్షన్ సోకిన జోన్‌గా, పది కిలోమీటర్ల పరిధిలో నిఘా జోన్‌గా ప్రకటించారు. గడచిన రెండు నెలల్లో నష్టపోయిన పొలాల నుంచి ఇతర పొలాలకు పందులను తరలించారా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇతర రకాల జ్వరాలకు భిన్నంగా ఉంటుందని, ఇది పందులను మాత్రమే ప్రభావితం చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. కాగా, గతేడాది కూడా రాష్ట్రంలోని వయనాడ్‌లో ఆఫ్రికల్ స్వైన్ ప్లూ కేసులు వెలుగుచూశాయి.