ఆప్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్ నియామకం

by S Gopi |
ఆప్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్ నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నందున పార్టీ బాధ్యతలు ఇప్పుడు సంజయ్ సింగ్‌పైనే ఉన్నాయి. సంజయ్ సింగ్ 2012లో ఆప్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీలో అత్యంత కీలక, ప్రభావవంతమైన నేతలలో ఒకరిగా మారారు. ఆయన తొలిసారిగా 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెండోసారి ఆప్‌ ఎంపీగా వెళ్లారు. ఇప్పుడు సంజయ్ సింగ్ పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆప్ తరపున శాసనసభ ఎజెండాను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరపడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నారు. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం సంజయ్ సింగ్ బెయిల్‌పై ఉన్నారు.

Next Story

Most Viewed