రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-06-08 13:53:49.0  )
రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉంచారు. రామోజీరావు మరణ వార్త విన్న చంద్రబాబు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రామోజీరావు పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story