తెలుగు అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-15 14:27:54.0  )
తెలుగు అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సీఏపీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ కానిస్టేబుల్ రాత పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. వచ్చే జనవరి 1 నుంచి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, గుజరాతీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు.

కాగా సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఇటీవల మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసుకునేందుకు అనుమతి కల్పించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోని వేలాది మంది అభ్యర్థులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed