- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవో 29 ని రద్దు చేసి.. గ్రూప్-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలి: మాజీ మంత్రి హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-1 అభ్యర్ధుల పట్ల పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఈ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న అభ్యర్థులను ఉద్దేశించి.. హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో తన ట్వీట్‌లో.. "జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణమే రద్దు చేసి, గ్రూప్-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం." అని రాసుకొచ్చారు. కాగా ఈ రోజు అశోక్ నగర్ సమీపంలో గ్రూప్-1 అభ్యర్థులు నిరసన తెలపగా.. వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో వారిని అరెస్టు చేశారు.