- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్: CEO వికాస్ రాజ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని ఆదర్శ పోలింగ్ బూత్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందన్నారు.
వర్షాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంల తరలింపులో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండ్లపై ఈవీఎంలు తీసుకెళ్లారని అన్నారు. ప్రజలంతా బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓటర్లకు వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.