Breaking: సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మ దహనం

by srinivas |
Breaking: సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జాతీయ రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు.

కాగా సబితా ఇంద్రారెడ్డి చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగిస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫిరాయింపులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తావన వచ్చింది. సబితా ఇంద్రారెడ్డి అక్క తనను మోసం చేశారని, కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్లిపోయారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు సభలో తనను అవమానించారని కంటతడి పెట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ ఈ రోజు (గురువారం) సీఎం దిష్టి బొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై సబితారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల ఆమె దిష్టి బొమ్మలను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.

Advertisement

Next Story