అదనపు ఆదాయం కోసమే 18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల భారం : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
అదనపు ఆదాయం కోసమే 18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల భారం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : అదనపు ఆదాయం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల పెంపు(Increase in electricity charges)తో 18 వేల కోట్ల అదనపు భారం మోపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR) పిలుపునిచ్చారు. చార్జీల పెంపు నిర్ణయం ప్రజా వ్యతిరేకమైనదని, ప్రజలంతా నిర్ద్వంద్వంగా తిరస్కరించాలన్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. విద్యుత్తు సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చు భారం కాదని, అది ప్రభుత్వ బాధ్యతని, డిస్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలేనని, ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదన్నారు. విద్యుత్తు అంటే వ్యాపారం కాదు..రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రమని, విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చు భారం కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు సర్ణయుగంగా మారిందని, కానీ కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని, దానికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలకులకు విజన్ ఉంటే సంపద పెంచి పేదలకు పంచాలి కానీ.. ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపి సంపద పెంచుకోవాలనే ఆలోచన చేయటం దుర్మార్గమన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 18వేల కోట్ల భారం మోపుతుందని, వివిధ కారణాలు చెప్పిన 963 కోట్లు అప్ ఛార్జీలను ప్రజలపై భారం వేయాలనుకోవటం సరికాదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా తక్షణం రూ. 12 వందల కోట్లు పెంచుకోవటంతో పాటు డిస్కంలు చేసిన 9 ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

డిస్కంలు చేసిన ప్రతిపాదన పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉందని, ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. 11కేవీ, 33కేవీ, 220 కేవీ కింద నడిచే పరిశ్రమలకు సంబంధించి అన్నింటిన ఒకే కేటగిరీ లోకి తేవటమనేది అసంబద్ధమని తప్పుబట్టారు. ఆదానీ ఒక ఫ్యాక్టరీ పెడితే వారికి వర్తించే కేటగిరీనే మా సిరిసిల్లలో సాంచాలు నడిపే పరిశ్రమకు ఉంచాలనుకోవటం హేతుబద్ధమైన నిర్ణయం కాదన్నారు. పరిశ్రమలకు సంబంధించి కరెంట్ ను అన్నింటిని ఒకే గాటున కట్టటమంటే సూక్ష్మ చిన్న, మధ్య పరిశ్రమలకు ఉరి వేస్తున్నట్లేనని, ఈ విధమైన కుట్ర చేస్తూ చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఛార్జీలు పెంచితే పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుందని, కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రలు బేంబేలెత్తేపోతాయన్నారు. డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మేము 12 వందల కోట్లు భరించాం. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదని ప్రశ్నించారు.

కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పరిస్థితి తేవటం శోచనీయమని విమర్శించారు. ఈఆర్సీ ఛైర్మన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే ప్రతిపాదనలను తిరస్కరించాలని మిమ్మల్ని కోరారు. అదనపు యూనిట్లు ఖర్చు ప్రభుత్వమే భరించి, సబ్సిడీలతో సెస్ సంస్థనును కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం వంటి ఆర్డర్ ఇక్కడి నేతన్నలకు ఇచ్చామని, వర్కర్ టూ ఓనర్ పథకం కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశామని, అప్పెరల్, టెక్స్ టైల్ పార్క్ లను బలోపేతం చేశామని, మరమగ్గాలను మోడ్రనైజేషన్ చేశామని తెలిపారు. గత పదేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10 మందికి పైగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో 10 హెచ్ పీ ల వరకు మాత్రమే సబ్సిడీ ఉందని, దాన్ని 30 హెచ్ పీ వరకు పెంచాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed