- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపార అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి
దిశ,మంథని : స్వశక్తి మహిళా సంఘాలతో ఏర్పాటు చేసే వ్యాపారాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పట్టణంలోని ఏ.ఎల్.ఆర్ కన్వెన్షన్ హాల్ లో మహిళా సంఘాలతో వీ-హబ్ సీఈఓ పి.సీత, ఇతర ప్రతినిధులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు వివిధ రంగాల్లో ఉన్న ప్రావీణ్యం, మహిళా సంఘాలకు ఉన్న అవసరాలు మొదలైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల అవసరాలు తెలుసుకున్న వీ-హబ్ బృందాలు మరో వారం రోజుల్లో మరో సారి పర్యటించి ఒక్కొక్క సంఘంతో నేరుగా ఇంట్రాక్ట్ అవుతూ వ్యాపార అభివృద్ధికి పాటించాల్సిన సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. మంథనిలోని మహిళా సంఘాలు ఆదర్శంగా నిలుస్తూ వ్యాపారాలు లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన సహాయ సహకారాలు, మార్కెటింగ్ సౌకర్యం మొదలైన అంశాలలో శిక్షణ అందించేందుకు వీ- హబ్ కృషి చేస్తుందని అన్నారు.
జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసే వ్యాపారాలకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని అన్నారు. వీ-హబ్ ప్రతినిధులు అందించే సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, మన జిల్లాలో మహిళా సాధికారత దిశగా మనమంతా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీ-హబ్ పోషకులు జహీద్ అక్తర్ షేక్, ముఖ్య సంపాదకులు సజ్జ ఉహ, సభ్యులు ప్రసన్న శ్రీరామ్, సాయిరాం, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.