- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్..విధుల నుంచి అధికారుల తొలగింపు
by Naveena |
X
దిశ, నారాయణపేట : మరికల్ మండలం కన్మనూరు గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 2 కోట్ల 70 లక్షల ఉపాధి హామీ పనులు దుర్వినియోగం అయిన విషయంపై నవంబర్ 13న ఉపాధి హామీ డబ్బులు మాయం అనే శీర్షికతో 'దిశ'లో వచ్చిన కథనం తో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందన లభించింది. ఉపాధి హామీ పనుల అవకతవకలపై మరికల్ మండలం కన్మనూరు ఫీల్డ్ అసిస్టెంట్ మతిన్, మాజీ ఇంచార్జ్ ఏపీవో చంద్రశేఖర్లను కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాల మేరకు విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డిఆర్డిఓ ఒక ప్రకటనలో తెలిపారు. మరికల్ మండలం కన్మనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై ఎంపీడీవో మక్తల్ తనిఖీ నిర్వహించి..కలెక్టర్ కు నివేదికను సమర్పించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా వారిద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు తెలిపారు.
Advertisement
Next Story