సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన మేయర్..

by Sumithra |
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన మేయర్..
X

దిశ, కాచిగూడ : కాచిగూడ మోతి నగర్ మార్కెట్ లో శుక్రవారం హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. ఎన్యుమరేటర్ లతో కలిసి స్థానికుల వివరాలను, సర్వే వివరాలను నమోదు చేయించారు. ప్రజలతో చర్చించి వారికి వున్న పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 63 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామన్నారు. అవసరమయితే మరికొన్ని రోజులు పొడిగిస్తాము అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సర్వే జరగకుండా అడ్డుకునేందుకు ఎన్యుమరేటర్ లను ఇబ్బంది పెడుతున్నారు.

అలాంటి వారిని ఉపేక్షించం అన్నారు. అవసరమైతే తమ కార్యకర్తలు ఎన్యుమరేటర్ లకు అండగా సర్వేలో పాల్గొంటారని చెప్పారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దు, సర్వేలో పాల్గొని, వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో రోడ్లు అపరిశుభ్రంగా ఉండటం గమనించిన మేయర్ జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. ఇక్కడ దుర్గంధ మైన వాసన ఎందుకు వస్తుంది ? అసలు ఇక్కడ రోడ్లు ఊడుస్తున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. పక్కనే మార్కెట్, ఇండ్లు వున్నాయి ఇలా అపరిశుభ్రంగా వుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిమంది స్థానికులు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రోడ్ల పై వేస్తున్నారని జిహెచ్ఎంసి అధికారులకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed