- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nitish Kumar Reddy : ఆయన మాటలే నాకు స్ఫూర్తి.. : నితీశ్ కుమార్ రెడ్డి
దిశ, స్పోర్ట్స్ : పెర్త్ టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం నితీశ్ రెడ్డి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘పెర్త్ గురించి చాలా విన్నాను. ఇక్కడ చివరి సారి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా గౌతమ్ గంభీర్ నాతో మాట్లాడారు. బౌలర్ల కఠినమైన స్పెల్స్, బౌన్సర్లను ఆడేటప్పుడు వాటిని దేశం కోసం బుల్లెట్స్‌లా భావించాలని సూచించాడు. అవే మాటలు తనలో స్ఫూర్తి నింపడంతో పాటు ధైర్యాన్నిచ్చాయి.’ అన్నాడు. తనపై నమ్మకం ఉంచి పెర్త్ టెస్ట్‌లో ఆడేందుకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా అని నితీశ్ తెలిపాడు. గంభీర్ మాటలతో మెంటల్‌గా స్ట్రాంగ్ అయినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నితీశ్ 41 పరుగులు, పంత్ 37 పరుగులు చేయడంతో భారత్ 150 పరుగులైన చేయగలిగింది. బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా సైతం ఈ పిచ్‌పై పరుగులు చేయడానికి శ్రమటోడ్చాల్సి వచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 67 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.