BSP స్టేట్ చీఫ్‌కు గ్రాండ్ వెల్కమ్.. నెల రోజుల తర్వాత స్వరాష్ట్రానికి RSP

by GSrikanth |
BSP స్టేట్ చీఫ్‌కు గ్రాండ్ వెల్కమ్.. నెల రోజుల తర్వాత స్వరాష్ట్రానికి RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబాయ్, అమెరికా‌లో నెలన్నర రోజుల పాటు పర్యటించిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ రాష్ట్రానికి చేరుకున్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికాయి. చీఫ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీలోని వివిధ స్థాయిల నేతలు, లీడర్‌లు రాత్రి నుంచే పడిగాపులు కాశారు. స్వాగతం పలికిన నేలందరినీ ఆర్ఎస్పీ పలకరించి పార్టీ శ్రేణులను ఆనంద పరిచారు.

ఉదయం రాజేంద్రనగర్ నుంచి లక్డీకాపూల్‌లోని స్టేట్ కార్యాలయానికి భారీ ర్యాలీలో తీసుకెళ్ళేలా పార్టీ శ్రేణులు ప్లాన్ చేశాయి. కానీ, ఆఖరి నిమిషంలో ప్లాన్ మారింది. నెలకు పైగా విరామం లేకుండా దుబాయ్, అమెరికాలో ప్రభుత్వ పాలనా విధానంపై చర్చలు, సభలు, సమావేశాలు నిర్వహించిన కారణంగా కాస్త విరామం కోసం ర్యాలీ రద్దు అయింది.

Advertisement

Next Story