కారులో తల.. రోడ్డుపై మొండెం.. ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

by M.Rajitha |
కారులో తల.. రోడ్డుపై మొండెం.. ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తల, మొండెం వేర్వేరు అయిన ఘటన ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్య అనే వృద్దుడు రోజువారీ కూలికి వెళ్ళి సోమవారం ఇంటికి వస్తూ దారి తప్పి ఔటర్ మీదుగా తుక్కుగూడ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. సరిగ్గా తొండుపల్లి సర్కిల్ లో ఔటర్ ప్రధాన రహదారిని దాటుతుండగా గచ్చిబౌలి వైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజయ్య తల కారు అద్దాన్ని తాకగా, అద్దం పగిలి తల అందులో ఇరుక్కుపోయింది. కారు ఆపకుండా ముందుకు అలాగే వేగంగా పోవడంతో కారు అద్దం మెడను కోసి వేసి తల కారు ముందు సీట్లో పడగా, మొండెం రోడ్డుపై పడిపోయింది. ఔటర్ పెట్రోలింగ్ బృందం, శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed