కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట!

by Ramesh N |
కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇరిగేషన్‌ శాఖలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడా కూడా జరగలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కాళేశ్వరం అవినీతి జరిగిందని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నిజనిజాలు ప్రజలకు తెలుపాలని బీఆర్ఎస్ భావించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కాళేశ్వరం‌పై బీఆర్ఎస్ పోరుకు సిద్దమైంది. మార్చి 10న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సభకు హాజరు కానున్న గులాబీ బాస్ కేసీఆర్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు మార్చి 1 న చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story