పెనం మీది నుంచి పొయ్యిలోకి.. మోడీ 3.0పై బీఆర్ఎస్ సంచలన ట్వీట్

by Rajesh |
పెనం మీది నుంచి పొయ్యిలోకి.. మోడీ 3.0పై బీఆర్ఎస్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కొలువు దీరిన మోడీ 3.0 ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. మోడీ 3.0 మొదలవడంతో దేశ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయిందని తెలిపింది. ఘోర రైలు ప్రమాదాలు ఆగడం లేదని.. పేపర్ లీకేజీ స్కామ్‌లు, ఉగ్రవాద ముప్పు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, పాలన నిల్ ప్రచార ఆర్భాటం ఫుల్ అని మండిపడింది. దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసే విధంగా మోడీ 3.0 పాలన మొదలయిందని ఆవేదన వ్యక్తం చేసింది. 2014 నుంచి ఇప్పటి దాకా 8 ఘోర రైలు ప్రమాదాలు జరిగాయని దేశ రైల్వే మంత్రి ఇవేమీ పట్టించుకోవడం లేదని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన మోడీ దేశంలో పేపర్ లీకేజీలను ఆపలేకపోతున్నారని సెటైర్లు వేసింది. ఉగ్రవాదుల దాడులను హోంమంత్రి అమిత్ షా ఆపలేకపోతున్నారని మండిపడింది. ఆర్థిక శాఖ మంత్రి నిరుద్యోగాన్ని తగ్గించరని.. ఇవన్నీ జరుగుతున్నా రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు మోడీ 3.0 ప్రొగ్రెస్ రిపోర్టు ఉందని ఘాటుగా విమర్శించింది.

Advertisement

Next Story