ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన బలాన్ని పరీక్షించుకోబోతున్న బీఆర్ఎస్.. సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?

by GSrikanth |
ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన బలాన్ని పరీక్షించుకోబోతున్న బీఆర్ఎస్.. సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
X

లెఫ్ట్ పార్టీలతో BRS పొత్తు దాదాపు ఖరారు.. తమ్మినేని, కూనంనేనికి KCR హామీ! https://www.dishadaily.com/telangana/clarity-on-brs-alliance-with-left-parties-cm-kcrs-key-assurance-207431బీఆర్ఎస్ పేరుతో మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ తన బలాన్ని పరీక్షించుకోబోతున్నది. పార్టీ పెట్టిన కొత్తలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సెంటిమెంట్‌గానే భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో 2001లో ఆవిర్భవించిన మూడు నెలల వ్యవధిలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి ఉనికిని చాటుకున్నది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ దీన్నే రిపీట్ చేయాలనుకుంటున్నది. త్వరలో జరిగే కొన్ని స్థానిక జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నది. ఈ ఉద్దేశంతోనే అక్కడి స్థానిక నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ముందు తన బలం ఎంతో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పరీక్షించుకోవాలనుకుంటున్నది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో వీటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చిక్కులు ఎదురవుతున్నాయి. రెండున్నరేళ్లుగా అడ్మినిస్ట్రేటివ్ అధికారుల పాలనలోనే ఉంటున్నాయని, అభివృద్ధి కుంటుపడుతున్నదనే విమర్శలూ వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొన్ని సీట్లు వస్తే ఆ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నాటికి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవచ్చన్నది గులాబీ బాస్ భావన.

టీఆర్ఎస్ ఫస్ట్ ఎంట్రీ ఇలా..

తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్ 27న ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలోనే తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసింది. 2001 జూలై మూడో వారం (12-17 తేదీల మధ్య) జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నది. 87 జడ్పీటీసీ స్థానాలను, వందకు పైగా ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్నది. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ పోటీచేయడంతో నాగలిపట్టిన రైతు గుర్తును రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది.

స్థానిక సెంటిమెంట్

తొలిసారి ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం కేసీఆర్ హెలికాప్టర్ వాడారు. రోజుకు సగటున ఎనిమిది చొప్పున బహిరంగసభల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం అవాకయ్యేలా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఫలితాల తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీగా 2017 ఆగస్టు 18న గుర్తింపు ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా సిద్దిపేట అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలోనూ కేసీఆర్ భారీ మెజారిటీతో గెలుపొందారు.

నిజాం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో..

మహారాష్ట్రకు చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్న సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా లాంటి అంశాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడిన వంద రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో గెలిచిన సెంటిమెంట్‌ను మహారాష్ట్రలోనూ ప్రయోగించాలనుకుంటున్నారు. లాంఛనంగా బీఆర్ఎస్‌కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ డిసెంబరు 9న గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాది చివరికల్లా మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ జరిగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తున్నది. మొత్తం 25 జిల్లా పరిషత్, 14 మున్సిపల్ కార్పొరేషన్లు, 284 పంచాయతీ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువగా నిజాం ప్రభావం ఉన్న మరాఠ్వాడా రీజియన్‌పై ఫోకస్ పెట్టింది. నాందేడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, పర్బణి, హింగోలి, యావత్‌మల్ తదితర జిల్లాలపై దృష్టి సారించింది.

స్థానిక పాచిక పారేనా?

మహారాష్ట్రలో స్థానిక సంస్థల్లో పోటీచేయడం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చన్నది బీఆర్ఎస్ ఆలోచన. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల అక్కడి ప్రజలకు ఎంత ఆదరణ ఉన్నదో స్పష్టం కావడంతో పాటు పార్టీ బలమెంతో తెలుసుకోడానికి దోహదపడనున్నది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుని బీఆర్ఎస్‌ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకోవచ్చన్నది మరో అభిప్రాయం.

ఆ ఎనిమిది జిల్లాలే టార్గెట్

మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న మరాఠ్వాడా రీజియన్‌లో ఔరంగాబాద్, నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్లు సహా ఎనిమిది జిల్లా పరిషత్‌లు, 76 పంచాయతీ సమితులు, 43 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ చోట్ల బీఆర్ఎస్ పేరుతో పోటీ చేసి ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. తద్వారా పార్లమెంటు ఎన్నికల నాటికి మరింత బలపడి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలన్నది కేసీఆర్ ప్లాన్. తెలంగాణ ప్రజలు షోలాపూర్ లాంటి ప్రాంతాల్లోనూ నివసిస్తున్నందున అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తున్నారు.

Also Read..

లెఫ్ట్ పార్టీలతో BRS పొత్తు దాదాపు ఖరారు.. తమ్మినేని, కూనంనేనికి KCR హామీ!

Advertisement

Next Story

Most Viewed