ఎడమ కాలువ గండ్ల పాపం బీఆర్ఎస్ నిర్వాకమే : మంత్రి ఉత్తమ్

by Y. Venkata Narasimha Reddy |
ఎడమ కాలువ గండ్ల పాపం బీఆర్ఎస్ నిర్వాకమే : మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎడమ కాలువ గండ్ల పాపం బీఆర్ఎస్ నిర్వాకమేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సాగర్ కాలువ గండి మరమ్మతుల జాప్యం జిల్లా మంత్రుల అసమర్థతకు నిదర్శనమన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలపై ఆయన తిప్పికొట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన నిర్లక్ష్యానికి నిదర్శనమే కాలువలకు, చెరువులకు గండ్లు అని విమర్శించారు. బీఆర్ఎస్ లోపభూయిష్టమైన ఇరిగేషన్ నిర్వహణ ఫలితానికి తాజా ఘటన పరాకాష్ట అన్నారు. నీటిపారుదల శాఖాను నిర్వీర్యం చేసింది చాలక..కాలువలు, ప్రాజెక్టుల నిర్వాహణ పట్ల నిర్లక్ష్యం చేసి.. మాపై నిందలా అని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలతో కాలువలకు గండి పడితే వరదలపై రాజకీయ బురద చల్లకండిని హితవు పలికారు.

మేం అధికారంలోకి వచ్చి ఆరేడు నెలలు కాలేదన్నారు. ఇరిగేషన్ శాఖలో మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయిన పట్టించుకోలేదని, మేం 26వ తేదీన 700మంది ఏఈఈలను, 1800మంది లస్కర్ లను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. భారీ వర్షాలు, వరదలతో కాలువలకు సూర్యాపేట జిల్లాలో వరద నష్ట సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సాగర్ కాలువ గండి మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

Next Story