మోడీకి తొందరెందుకు.. లక్షద్వీప్ ఘటన మరిచిపోయారా..?

by GSrikanth |
మోడీకి తొందరెందుకు.. లక్షద్వీప్ ఘటన మరిచిపోయారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లక్షద్వీప్ ఘటన తెలిసి కూడా రాహుల్ గాంధీ విషయంలో మోడీకి ఎందుకు అంత తొందర..? అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం దేశప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రజాస్వామికంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. అనైతిక చర్యలకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోడీకి అలవాటై పోయిందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ దాడులతో విపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు కేంద్రం గురి చేస్తుండగా.. తాజాగా చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని బర్తరఫ్ చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. తన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story