పేద కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం : రసమయి

by Sathputhe Rajesh |
పేద కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం : రసమయి
X

దిశ ,శంకరపట్నం: పేద కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఉన్నారని మానకొండూర్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టి పేదలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే పొద్దుపొడుపు కార్యక్రమంలో భాగంగా, మండలంలోని తాడికల్, వంకాయ గూడెం, కేశవపట్నం, మొలంగూర్ గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దేశ ప్రయోజనం కోసం బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. పేద కుటుంబాల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలైన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ కంకణ బద్ధుడై ముందుకు సాగుతున్నాడన్నారు.

అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పేద కుటుంబాల ఆడబిడ్డ కళ్యాణానికి రూ.1 లక్ష116లను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతు ఆర్థిక ఎదుగుదల కోసం రైతుబంధు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, రాజయ్య, భద్రయ్య, రవి, ఎంపీటీసీ ఎస్‌కే మోయిన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరస్వామి, మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ సాగి మలహల్ రావు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story