కేసీఆర్ భారీ స్కెచ్.. ఏపీ కీలక నేతపై సీఎం కన్ను..!

by Satheesh |   ( Updated:2023-02-17 09:55:37.0  )
కేసీఆర్ భారీ స్కెచ్.. ఏపీ కీలక నేతపై సీఎం కన్ను..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రమైన ఏపీలో తన పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంట్రీ ఆసక్తిగా మారుతోంది. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణపై గులాబీ నేతలు కన్నేశారు. కన్నాను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తామని ఏపీ గులాబీ నేత రావెల కిషోర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం రావెల మాట్లాడుతూ.. సోమువీర్రాజు బీజేపీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. గతంలో రావెల కిషోర్ బాబు సైతం బీజేపీ నుంచి బయటకు వచ్చారు.

ఈ నేపథ్యంలో సోము వీర్రాజు విధానాలు నచ్చక కమలం పార్టీ నుంచి బయటకు వచ్చిన కన్నాను బీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా రావెల ప్రయత్నాలు చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఇదిలా ఉంటే బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉండగా జనసేనా పెద్దలతోనూ కన్నా టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనారాయణను కారు ఎక్కేలా రావెల చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

దివ్యాంగురాలి హత్యపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

Advertisement

Next Story

Most Viewed