గవర్నర్‌ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

by GSrikanth |
గవర్నర్‌ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను సోమవారం బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. డిప్యూటీ హై కమిషనర్‌గా నియామకం అయినందుకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బ్రిటీష్ ప్రభుత్వం మధ్య ఉన్న పెట్టుబడులు, సహాయ సహకారాలపై చర్చించారు.

ఎమ్మెల్సీ కవితతోనూ భేటీ

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు పలు అంశాలను చర్చించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించారు.

Advertisement

Next Story