- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభం.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, 15 నిమిషాల ముందే నిర్వాహకులు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేశారు. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు జూన్ 2 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఫస్ట్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరగనుంది. ఈ సారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా, టెట్ పరీక్షలను తొలిసారి కంప్యూటర్ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
Advertisement
Next Story