BREAKING : రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి 144సెక్షన్

by Rajesh |
BREAKING : రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి 144సెక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం 13న ఉండగా.. కాసేపటి క్రితం ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో మైకులు మూగబోయాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఎల్లుండి సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. ఎల్లుండి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఎల్లుండి నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. సోమవారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 1న చివరి విడత పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ 13న తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.

Advertisement

Next Story