BREAKING: ఘట్‌కేసర్ వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు.. రూ.37 లక్షల నగదు స్వాధీనం

by Shiva |
BREAKING: ఘట్‌కేసర్ వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు.. రూ.37 లక్షల నగదు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిధ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఓటర్లను డబ్బుతో ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆ నగదును జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించారు.

Advertisement

Next Story